VZM: ఇటీవల దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైన నేపథ్యంలో విజయనగరం జేసీ సేతుమాధవన్ శుక్రవారం మెరకముడిదాం మండల కేంద్రంలో పలు రైస్ మిల్లులను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వర్ష సూచనలు కారణంగా రైతులకు మిల్లర్లు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి ఆర్డీవో సత్యవాణి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ మీనా కుమారి పాల్లొన్నారు.