శ్రీకాకుళం జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఏ.రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ఉపాధ్యాయులు డీఈవో కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు డీఈవో కార్యాలయాన్ని సందర్శించాలని పేర్కొన్నారు.