KRNL: దేవనకొండలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో డ్రైనేజీలు, కాలువలు, సీసీ రోడ్లను ఏర్పాటు చేయాలని AISF యువజన సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. AISF నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతంలో డ్రైనేజీ, కాలువలు, సీసీ రోడ్లు లేక మురుగు నీరు రోడ్లపై పారుతుందన్నారు. వర్షాకాలంలో ఈ పరిస్థితి మరి దారుణంగా ఉంటుందని ఆరోపించారు.