CTR: చిత్తూరు మండలం తుమ్మిందకు చెందిన బాబు ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్. అతని భార్య కవిత ఆ బస్సులోనే హెల్పర్‌గా పనిచేస్తున్నారు. కవితకు ఇటీవల రూపేశ్ అనే వ్యక్తి పరిచయం కావడంతో బంగారు నగలు ఇచ్చింది. వాటిని అతను తిరిగి ఇవ్వలేనని చెప్పాడు. నగల విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన కవిత తన కుమారుడు ముఖేష్(4)తో కలిసి బావిలో దూకింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.