KDP: 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు ప్రజలను కోరారు.