VZM: త్వరలో జరిగే స్థానిక ఎన్నికలకు జనసైనికులు సమాయత్తం కావాలని జనసేన ఎస్.కోట నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఆదివారం ఎల్.కోట పార్టీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడుతూ.. పలువురు నాయకులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ ఆసక్తిని తెలియజేశారన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు తదుపరి ప్రణాళికలు సిద్ధం చేస్తామని నాయకులకు తెలిపారు.