NLR: నెల్లూరు నగరంలోని 5వ డివిజన్ ఎస్వీఆర్ పార్కులో రూ. 40 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ ఎక్విప్మెంట్ స్థాపనకు మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం శంకుస్థాపన చేశారు. అదేవిధంగా 14వ డివిజన్ AC నగర్ పార్కులో రూ.30 లక్షలతో ఏర్పాటు చేయనున్న జిమ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయనతోపాటు కమిషనర్ సూర్య తేజ, కార్పొరేటర్లు, నాయకులు కార్యకర్తలు ఉన్నారు.