ATP: సమాజసేవ కంటే మించింది మరొకటి లేదని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు సూచించారు. రాయదుర్గంలోని MPDO కార్యాలయంలో గురువారం పాఠశాల విద్యావ్యవస్థ పునర్నిర్మాణంపై జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఉపాధ్యాయులపై సామాజిక బాధ్యత ఎంతో ఉందన్నారు. అందుబాటులో ఉన్న వసతులను సద్వినియోగం చేసుకుంటూ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలన్నారు.