KRNL: ఆదోని రైల్వే స్టేషన్లో కేంద్ర ప్రభుత్వం ‘ఒక స్టేషన్ – ఒక ఉత్పత్తి’ పథకాన్ని స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆదోని ప్రాంతానికి ప్రత్యేకమైన స్థానిక ఉత్పత్తులను రైల్వే స్టేషన్లోని ప్రత్యేక స్టాళ్ల ద్వారా ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. స్వయం ఉపాధి కలిగిన వారికి ఆదాయం పెరిగేలా దోహదపడుతుందన్నారు.