CTR: కూటమి ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 13న రాయచోటిలో నిర్వహించే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ వైసీపీ శ్రేణులు హాజరుకావాలని ఆయన కోరారు. ఉదయం 9:30 గంటలకు రాయచోటి బస్టాండ్ సమీపంలోని వైసీపీ కార్యాలయానికి చేరుకోవాలని చెప్పారు.