సత్యసాయి: బత్తలపల్లి మండలం పత్యాపురం గ్రామం నుంచి తాండా వరకు రూ. 85 లక్షల వ్యయంతో నిర్మించిన 1060 మీటర్ల బీటీ రహదారిని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధి, రహదారులు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పన ప్రభుత్వ ప్రాధాన్యమని తెలిపారు. తొలుత భారీ గజమాలతో మంత్రికి స్వాగతం పలికారు.