GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 18న జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని AISF జిల్లా అధ్యక్షుడు గండు శివ పిలుపునిచ్చారు. పొన్నూరు CPI కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. PPP విధానం వల్ల పేద ప్రజలకు, పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ప్రజాస్వామ్య వాదులందరూ ఈ ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.