సత్యసాయి: రొద్దం మండల పరిధిలోని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహశీల్దార్ ఉదయ శంకర్ రాజు, ఎంపీడీఓ ప్రేమ్ కుమార్లను ఎంపీ పార్థసారథి ఆదేశించారు. సోమవారం మరువపల్లిలో తన స్వగృహంలో అధికారులతో సమీక్షించారు. ఎంపీ మాట్లాడుతూ.. మండల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారుల దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.