KRNL: ఆదోని మండలంలోని గణేకల్లు గ్రామాన్ని పెద్దహరివాణం మండలంలో కలపాలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా గ్రామస్థులు శుక్రవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రజా అభిప్రాయాన్ని పట్టించుకోని నిర్ణయాలను అంగీకరించబోమని వారు స్పష్టం చేశారు. “మా గ్రామం ఆదోని మండలంలోనే కొనసాగాలి” అనే నినాదంతో ఐక్యంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని గ్రామస్థులు తెలిపారు.