NLR: బుచ్చి మండలంలోని నాగమంబాపురం గ్రామంలో సచివాలయం పక్కనే ఉన్న మార్గంలో పేరుకుపోయిన చెత్తను ఎంపీడీవో శ్రీహరి ఆదేశాలతో పంచాయతీ అధికారులు శనివారం తొలగింపజేశారు. ఇటీవల ఎంపీడీవో గ్రామంలో పర్యటించి పేరుకుపోయిన చెత్తతో పాటు రోడ్లపై పేడ దిబ్బలను తొలగించాలని అధికారులకు సూచించారు.