SKLM: సరుబుజ్జిలి మండలం వెన్నెల వలసలో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ బేతన స్వామి మాట్లాడుతూ.. పెద్దలను గౌరవించడం, క్రమశిక్షణతో కూడిన విద్య, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వంటి విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మానసిక ఆరోగ్య కౌన్సిలర్ సుగుణ పాల్గొన్నారు.