అన్నమయ్య: బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 60 మందికి ఆదివారం రాత్రి మదనపల్లె పోలీస్ ట్రీట్మెంట్ ఇచ్చారు. డీఎస్పీ కొండయ్య నాయుడు ఆదేశాలతో స్పెషల్ పార్టీ పోలీసులు తనిఖీలు చేసి 60మందిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారంతా బహిరంగ మద్యం తాగుతున్నట్లు గుర్తించామని డీఎస్పీ చెప్పారు. ఎస్పీ ఆదేశాలతో ఇక నుంచి స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తామని తెలిపారు.