శ్రీకాకుళం: నగరంలోని పెద్ద మార్కెట్లో వ్యాపారుల జాబితా తయారైతే ప్రణాళిక ప్రకారం నిర్మాణం చేయడానికి ముందుకు వెళతామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు.పెద్ద మార్కెట్ పునర్నిర్మాణ పనుల కోసం ఈ నెల 15లోగా షాపులు ఖాళీ చేయించాలని మంత్రి అచ్చెన్న ఇటీవల ఆదేశించారు. దీంతో వ్యాపారులంతా బుధవారం ఎమ్మెల్యేతో సమావేశమయ్యారు. స్థలాలు కేటాయింపుపై చర్యలు తీసుకుంటామన్నారు.