ప్రకాశం: పామూరు మండలం బొట్లగూడూరులో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశాలనుసారం సోమవారం గోకులం షెడ్‌కి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎర్రగోళ్ల బాల, కోటపాటి రాజా, అడుసుమల్లి శ్రీనివాసులు, దేవరపు శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.