అన్నమయ్య: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాషా పిలుపునిచ్చారు. ఇవాళ స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో భాగంగా కోమటి వాని చెరువు వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.