అన్నమయ్య: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తానని మదనపల్లెకు చెందిన ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా ధీమా వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి ప్రతి ఒక్కరిని కలుపుకుని పార్టీని బలోపేతం చేస్తానన్నారు.