KDP: పులివెందుల పట్టణంలో ఆధార్ నవీకరణకు ఈనెల 24నుంచి 29వరకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పురపాలక కమిషనర్ రాముడు తెలిపారు. నగరిగుట్టలోని రవీంద్రనాథ ఉన్నత పాఠశాల, మెయిన్ బజారులోని రమణప్ప సత్రం పాఠశాల, 27, 28 తేదీల్లో బయమ్మతోటలోని నివేదిత పాఠశాల, కడప రోడ్డులోని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలికల పాఠశాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు.