SKLM: రాష్ట్ర హోంమంత్రి అనిత శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు హోం మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.