VZM: కొత్తవలస మండలం తుమ్మికాపల్లి పంచాయతీ సర్వే నంబరు 179-1లో ఓ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని గృహ నిర్మాణం దర్జాగా చేపడుతున్నాడు. గతంలో ఇదే సర్వే నెంబరులో పూర్వ ఎమ్మార్వో నీలకంఠరావు హెచ్చరిక బోర్డును వీఆర్వోతో ఏర్పాటు చేశారు. దీనిమీద మండల రెవెన్యూ పరిశీలకుడుని వివరణ కోరగా వీఆర్వోను పంపించి పనులను నిలుపుదల చేశారు.