NLR: కావలి నియోజకవర్గం ప్రజలందరూ కురుస్తున్న వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సూచించారు.ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మంగళవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో 12,13,14 తేదీల్లో అప్రమత్తంగా ఉండాలి ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగిన అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.