KKD: ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే క్షేమంగా ఇంటికి వెళ్లొచ్చని కాకినాడ ట్రాఫిక్ వన్ సీఐ నూనె రమేష్ అన్నారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో విద్యార్థులతో ముఖాముఖి సమావేశమయ్యారు. తల్లిదండ్రులకు ట్రాఫిక్ రూల్స్ గురించి పిల్లలు వివరిస్తే మంచి ఫలితం ఉంటుందన్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్ట్ తదితర అంశాలపై సీఐ వివరించారు.