ATP: తాడిపత్రిలో అంగన్వాడీ కేంద్రాన్ని మంగళవారం ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఛైర్మన్ విజయ ప్రతాపరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సెంటర్లో రికార్డులను పరిశీలించారు. గర్భవతులు, బాలింతలకు సక్రమంగా పౌష్టిక ఆహారం అందిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ డా.బీఎన్ శ్రీదేవి, సీడీపీవో, ఇతర సిబ్బంది ఆయన వెంట పాల్గొన్నారు.