శ్రీకాకుళం: పాతపట్నం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన క్యాంప్ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రజలు తమ సమస్యలను ఆర్జీల రూపంలో ఎమ్మెల్యేకు సమర్పించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.