NLR: అల్లూరు పట్టణంలోని గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లికి మంగళవారం విశేష పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం రాత్రి దేవస్థానం ఆవరణలో పల్లకి సేవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అమ్మవారి పల్లకిని అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ఊరేగించారు. చుట్టూ ప్రక్కల ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాదాలను స్వీకరించారు.