SRD: ప్రజా సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం చేస్తుందని జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. సంగారెడ్డిలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కన్వీనర్ సుధాకర్, సెంట్రల్ జోన్ కమిటీ సభ్యులు సాల్మన్ రాజ్ హాజరవుతున్నారని పేర్కొన్నారు.