KRNL: దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి ఆలయంలో ప్రతీ విజయదశమి రోజున బన్నీ ఉత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహిస్తారు. రాయలసీమ, కర్ణాటక ప్రజలకు ప్రసిద్ధి చెందిన ఈ కర్రల సమరంలో చుట్టు పక్కన గ్రామాల భక్తులు పక్షం (15) రోజుల పాటు కఠోర దీక్షలు పాటిస్తారు. మాంసాహారం, మద్యం, దాంపత్య జీవితం, చెప్పులు వీడి ఆచారాలు కొనసాగిస్తారు.