NTR: మైలవరం సర్కిల్ పరిధిలో కళాశాలలు, పాఠశాలలు, రద్దీగా ఉండే ప్రాంతాలు నిర్మానుష్య ప్రాంతాలలో నిరంతరం నిఘా ఉంచేందుకు సీఐ డి. చంద్రశేఖర్ డ్రోన్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఎస్సై సుధాకర్‌తో కలిసి డ్రోన్ పరీక్షించారు. పోలీసులు వినూత్నంగా ఆలోచించి నేరాలను నియంత్రించేందుకు ఆధునిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నామన్నారు.