కోనసీమ: విద్యతోనే ఉన్నత శిఖరాల్ని అధిరోహించవ్చని, విద్యార్థులు ఆదిశగా కష్టపడి చదువుకుని తల్లితండ్రులకు మంచి పేరును తీసుకురావాలని ప్రముఖ సామాజిక సేవకురాలు, బండారు ఫౌండేషన్ ఛైర్మన్ బండారు శ్రీదేవి అన్నారు. అల్లవరం మండలం గోడి గురుకుల బాలుర పాఠశాలలో ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు అత్యుధిక మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.