కృష్ణా: 2025 JEE మెయిన్ పేపర్-1లో 100% స్కోర్ చేసిన ఏకైక మహిళా అభ్యర్థిగా నిలిచిన గుత్తికొండ సాయి మనోజ్ఞకు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఉజ్వల భవిష్యత్ కోసం కలలు కనే ప్రతీ విద్యార్థికీ మన రాష్ట్రానికి చెందిన సాయి మనోజ్ఞ ఆదర్శంగా నిలిచిందని సుజనా ప్రశంసించారు.