ASR: పిల్లల బంగారు భవిష్యత్‌కు పోలియో చుక్కలు తప్పనిసరి అని ఎస్టీ కమీషన్ మెంబర్ కిల్లో సాయిరాం అన్నారు. ఆదివారం అరకులోయ మండలం పద్మాపురం పంచాయితీ యఃడపల్లివలసలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ మేరకు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. తల్లిదండ్రులు సామాజిక బాధ్యతగా బావించి ఐదేళ్ళ లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు.