KRNL: రైతులకు 50శాతం సబ్సిడీతో పప్పు శనగ విత్తనాలు పంపిణీ చేయాలని ఏపీ రైతు సంఘం ఆలూరు మండల కార్యదర్శి ఈరన్న డిమాండ్ చేశారు. మంగళవారం వ్యవసాయ సంచాలకుల కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ మంజునాథకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న క్వింటా పప్పుశనగ రూ.9,400కు గాను 25శాతం సబ్సిడీతో రూ.7,050కు అందించడం దుర్మార్గమని మండిపడ్డారు.