కోనసీమ: జిల్లాలో భూగర్భ జలాలు కలుషితమవడంతో ప్రజలు రోగాల బారిన పడి, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పి.గన్నవరం MLA గిడ్డి సత్యనారాయణ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. నరేంద్రపురంలో పీహెచ్సీ మంజూరైనప్పటికీ అక్కడ సరైన సిబ్బంది లేక వైద్య సదుపాయాలు అందడం లేదన్నారు.