GNTR: పొలం పిలుస్తుంది కార్యక్రమం వేములూరుపాడు గ్రామంలో మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏరువాక కేంద్రం సీనియర్ సైంటిస్ట్ వెంకట్ రాములు, జిల్లా వనరుల కేంద్రం సహాయ వ్యవసాయ సంచాలకులు శివ కుమారి పాల్గొన్నారు. సైంటిస్ట్ వెంకట్ రాములు మాట్లాడుతూ.. ప్రత్తిలో గులాబీ రంగు పురుగు నివారణకు లింగాకర్షక బుట్టలు ఏర్పాటు చేసుకోవాలన్నారు.