సత్యసాయి: సోషల్ మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేసినా, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా, అటువంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. గురువారం ఎస్పీ ప్రకటన విడుదల చేస్తూ వర్గాల మధ్య విద్వేషాలు రగిల్చే విధంగా, వ్యక్తిగత పేరున ఫొటోలు మార్ఫింగ్ చేసినా, మానాభిమానులు దెబ్బతినే విధంగా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యల తీసుకుంటామని తెలిపారు.