ప్రకాశం: కనిగిరి మండలం బడుగులేరు, పునుగోడు గ్రామాల్లో శనివారం మండల వ్యవసాయ అధికారిని పి జోష్ణ దేవి పొగాకు రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇతర దేశాల్లో పొగాకు సాగు పెరగటం వల్ల మన దేశంలో సాగుచేసిన రైతులకు ధర ఆశాజనకంగా ఉండకపోవచ్చని తెలిపారు. పొగాకు సాగుకు బదులు ప్రత్యామ్నాయంగా కంది, మిరప, అలసంద సాగు పై దృష్టి సారిస్తే లాభంగా ఉంటుందన్నారు.