VZM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబందించి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న బ్యాలెట్ పత్రాల తనిఖీ కార్యక్రమం నేడు కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో చేపట్టారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా. బిఆర్. అంబేద్కర్ తనిఖీ ప్రక్రియను పరిశీలించారు. డీఆర్ఓ ఎస్. శ్రీనివాసమూర్తి, ఎన్నికల సూపరింటెండెంట్ భాస్కరరావు పాల్గొన్నారు.