అన్నమయ్య: మదనపల్లి మండలంలో భూకబ్జాలు జరగకుండా గ్రామ రెవెన్యూ అధికారులు దృష్టి సారించాలని మదనపల్లి తహసీల్దార్ ఖాజాబీ కోరారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పట్టణ పరిసరాలలో అధిక సంఖ్యలో చెరువులు, వంకలు ఆక్రమించి కబ్జా రాయుళ్ళు అక్కడ నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయని ఆమె అన్నారు.