AKP: మాడుగుల ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఇంఛార్జ్ ఎంపీడీవో జీ.వీ.ఎస్.గోపాలరావు ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ తరగతులను నిర్వహించారు. ఇందులో భాగంగా సర్పంచులు చేయవలసిన విధులు, బాధ్యతలతో పాటు పంచాయతీ కార్యదర్శులు చేయవలసిన పనుల గురించి వివరించారు. శిక్షణలో తెలుసుకున్న అంశాలను అమలు చేయాలని చెప్పారు.