అన్నమయ్య: మదనపల్లె పట్టణంలో మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయడం జరుగుతుందని ఎమ్మెల్యే షాజహాన్ భాషా పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని రెండవ వార్డులో ఆయన విస్తృత పర్యటన చేశారు. నూతన రోడ్డు నిర్మాణం డ్రైనేజీ కాలువలకు భూమి పూజ చేశారు. అనంతరం త్రాగునీటి బోరును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు.