ELR: జిలుగుమిల్లీలో పోలీసులు ఆదివారం వాహన తనిఖీలు చేపట్టారు. పోలీసుల తనిఖీలు చూసి ద్విచక్ర వాహనంపై పారిపోతున్న ఇద్దరు యువకులను పట్టుకున్నారు. బండిని తనిఖీ చేయగా సుమారు 10.150 కేజీల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. రాజపుత్ కమల్ సింగ్, ఆకుల వంశీ కృష్ణ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.