W.G: మన్యం జిల్లాలోని మక్కువ మండల విలేకరి మాల్యాడ రామారావుపై మండల టీడీపీ అధ్యక్షుడు గుల్ల వేణుగోపాల్ దాడి చేయడాన్ని నిరసిస్తూ యలమంచిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జర్నలిస్టులు సోమవారం నిరసన చేపట్టారు. అనంతరం తహశీల్దార్ గ్రంధి పవన్ కుమార్‌కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు.