VZM: జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ వర్షం దంచి కొడుతోంది. క్షణం కూడా గ్యాప్ లేకుండా వర్షం కురుస్తోంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై చిరు గాలులు వీస్తున్నాయి. దసరా పండగను ప్రజలు వర్షంలో జరుపుకోవాల్సి వచ్చింది. రాత్రి నుంచి వర్షం దంచి కొడుతుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా చెరువులకు జలకళ సంతరించుకుంది.