BPT: నిజాంపట్నం మండలం కళ్ళిఫలం నందు గురువారం శ్రీనాగేంద్రస్వామి నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవము జరుగుతుందని గ్రామ పెద్దలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. రేపు ఉదయం 8-51గంటలకు ప్రతిష్ట జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొంటారని తెలిపారు. ప్రతిష్ట మహోత్సవంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.