KNL: దొంగతనానికి పాల్పడే ముగ్గురు దొంగలను అరెస్టు చేసి 28 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ అన్నారు. మంగళవారం కర్నూలు నాలుగో పట్టణం పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని పలు దొంగతనాల కేసులలో నిందితులుగా ఉన్న వంశీనాథ్, హనుమంతును అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 28 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నారు.