W.G: ఉచిత వైద్య శిబిరాలతో ఎంతో ఉపయోగమని, ఇటువంటి వైద్య శిబిరాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం కొపా కళ్యాణ మండపంలో హైదారాబాద్ కాంటినెంటల్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. అనుభజ్ఞులైన వైద్యులచే మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.